Monday, June 2, 2008

తపన

పాలబుగ్గల పసితనంలో పాలకోసం
తప్పటడుగు తనువులో తల్లివొడి కోసం
ఊహ తెలియని వయసులో చందమామ కోసం

కాన్వెంటు కాలంలో కారు బొమ్మ కోసం
పాఠశాల ప్రాయంలో పాకెట్ మని కోసం
కాలేజి కాలంలో కన్నె పిల్ల కోసం

యుక్త వయసులో ఇష్టమయిన వృత్తి కోసం
మధ్య వయసులో మనశ్యాంతి కోసం
వృద్ధ వయసులో ఒక తోడు కోసం


తెల్లవారితే కడుపు నిప్పే కూటి కోసం
పొద్దు గూకితే కళ్లు నిప్పే నిదుర కోసం

రణరంగం లో జన్మభూమి కోసం
జనరంగం లో సొంతభూమి కోసం

జననం లో పుణ్యఫలం కోసం
మరణం లో మరోజన్మ కోసం

Sunday, May 18, 2008

కాసులకై


కాసులకై


కాసులకై కన్న వాళ్ళను సొంత ఊరును వొద్దని
కలకలలాడే దేశం ప్రాణమిచ్చే స్నేహ లోకం కాదని
కనిపించని దూరంలో మనీ తప్ప
మనసు లేని మనుగడ చేస్తున్నాము


జోబి నిండా డబ్బులు కావాలి
జూబ్లి హిల్స్ లొ బంగ్లా కావాలి అంటూ
కాసులకై కంప్యూటర్లతో కలిసి పరిగెడుతూ
కార్పొరేట్ దేశంలో కర్పూరం లా కరిగిపోతున్నాము


L Ragas ...

Saturday, May 17, 2008

Sunday, May 11, 2008

ఎందుకు ?



కూయలేని కోయిలకు మల్లెల మాసపు మాధుర్యమేందుకు
నడవలేని నెమలికి వాన జల్లుల పరవశమెందుకు

ఉదయించని సూర్యునికి ఉషావర్ణాల తూర్పెందుకు
అమావాస్య చంద్రునికి వెండివెన్నల తోడేందుకు

చూడలేని అంధునికి రంగు రంగుల అందాలేందుకు
చెప్పలేని మూగవాడికి మధురమయిన భావాలేందుకు

ప్రేమలేని మనసుకు అందచందాల ఆయిష్యేందుకు
నీ ప్రేమ లేని లోకంలో నిరాశ నిస్ప్రుహాల న పయనమేందుకు ??

L Ragas ...

సొంతం

చిరు నవ్వులు

చిలిపి చూపులు

చిలక పలుకులు నా చెలికే సొంతం ...




సరస సాగరాల నా చెలి సొగసు

విరహ వయ్యారాల నా చెలి వయసు

ముద్దు మురిపాల నా చెలి మనసు నాకే సొంతం ... L Ragas

మౌనగీతం

Tuesday, April 22, 2008

స్వాగతం


ఉషోదయ కిరణాల తూర్పు , సంధ్యా వెలుగుల తీరము
వెండి వెన్నల చందమామ , నిండు పువ్వుల మల్లే తోట
నింగికేగిసిన నీటి మేఘాలు, నేలకొరిగిన వాన చినుకులు

అమ్మచేతి గోరుముద్దలు, అప్పుడప్పుడు నాన్న క్లాసులు
దీపావళి టపాసుల వెలుగులు, సంక్రాంతి సంబరాలు
అలసి పోయేంతగా ఆటలు, మనసుకు నచ్చిన పాటలు

ఆకాశవాణి సుప్రబాతం, ఆలయంలో భగవద్గీత
పొరుగు వాళ్ళతో బాతాకని, స్నేహితుల సరదా జోకులు
శనివారం సెకండ్ షో సినిమా, ఆదివారం పదింటి దాక పడక

ఇలా చిన్నిచిన్ని ఆశలతో, చిలిపి చిరు నవ్వుల అనుభవాలతో
చిరాకులోను చిరునవ్వే బాటగా సాగే ఈ నా చిన్నిలోకం లోకి
మూడు ముళ్ళ బంధంతో నాలో సొగమయి నన్ను సంపూర్ణం చేసి
ఏడడుగుల అనుబంధంతో నూరేళ్ళు నాతో కలసి వొచ్చే
నా చిరునవ్వుల శ్రీమతి కి ఇదే నా ప్రేమ పూర్వక స్వాగతం

ప్రేమతో ...
L Ragas