Saturday, January 22, 2011

జీవితం

జీవితం

ఆరో తరగతి వరకు ఆటపాటలతొ ఆనందంగా సాగె కాలము
అనుకోని అనారోగ్యాన్ని అర కొర వైద్యము ఆపలేక పోయె, తండ్రి పోయె
ఆ దిగులుతొ తల్లి కూడ తండ్రిదరికే తరలి పోయె, బ్రతుకు భారమాయె

ఉన్న ఆస్తి అన్న తాగుడుకి తరిగిపోయె
ఒదిన పెత్తనానికి బ్రతుకు వీదిపాలాయె
తిండె కరువాయె, ఊరు చివర గువియె గూడాయె

తప్పుదారి పడదామంటె తల్లికిచ్చిన మాట గురుతాయె
ఎస్.ఎల్.సి చదవాల, అమ్మ కోరిక తీర్చాల కాని పైసలు లెవాయె
అయిన వాళ్ళింటికె వారాల పని కుదిరె, ఒడ్లు దంచి కట్టెలు కొట్టగా కడుపు నిండె

వయసు పెరిగె, వయసుతొ పాటు ఆకలి పెరిగె
గొడ్డు చాకిరి చేసినా సద్ది కూడె తిండాయె
ఎలా బతకాలి ఎన్నాల్లిలా బతకాలి అని మనసంతా దిగులాయె

అడవి తల్లి కరుణించె ఫారెష్టు గార్డు ఇంట పనికుదిరె
పట్టణంలొ పోలీసు సెలెక్షను కబురందె, పట్టుదల మొదలాయె
పచ్చిపాలు తాగి అడవి ఫలాలు తిని, బాద కోపం కసి కలగలిపిన
కసరత్తులతొ కఠిన సాధన సాగె, కానీష్టెబులు ఉద్యొగం ఒచ్చె

మూడు పూటల భోజనం దొరికె
పెళ్ళి జెరిగె, బిడ్డకూడ పుట్టె
కాలం మళ్ళి చిన్న చూపు చూసె
పుట్టిన బిడ్డ రెండొ రోజె కనుమూసె
ఆ బిడ్డ తోటె తల్లీ పయనమాయె, మళ్ళి ఒంటరి బతుకాయె

శోక సముద్రంలొ బ్రతుకు నావ సాగె
శూన్య ప్రయాణంలొ సంవత్సరాలు గడిచిపోయె
గత జ్ఞాపకాలు మరిచాక పెద్దల ప్రొద్బలంతొ మరో పెళ్ళి జెరిగె
అయిదుగురు సంతానంతొ వంశవ్రుక్షము చిగురించె

పేదరికం నుంచి బ్రతుకు బయట పడె
మధ్యతరగతి మహాభారతం మొదలాయె
సొంత ఇంటి కల, ఆ కల సాధనలొ అత్తమామల గోల
అన్నీ దాటెక గ్రుహొపవేశ ఆనందము
ఇంతలోనే చిన్నోడికి ప్రాణాపాయ జబ్బు
ఆ వైద్యుడు ఈ వైద్యుడు అంటూ పరుగులు
అప్పులతొ ఆపరేషన్ అయ్యాకే చావునుంచి చిన్నోడు బయటపడె

పిల్లల చదువులు, ఆపై ముగ్గురు ఆడ పిల్లల పెళ్ళిల్లు
వియ్యంకుల పట్టింపులు, అల్లుల్ల బుజ్జగింపులు
ఇలా ఒడిదిడుకుల ప్రయాణంలో మరో మలుపుగా వొచ్చె మధుమెహ వ్యాది

ఉన్న ఊరిలొ సొంత ఇల్లు
సొంత ఊరిలొ కొంత భూమి తప్ప
ఏమీ పెద్దగా పోగు చేయలేకపోయె
పూర్తిగా స్తిరపడని పెద్దొడు
పై చదువులకెళ్ళిన చిన్నోడు
ఇంతలోనే వొచ్చె పదవీవిరమన సమయము,మళ్ళీ దిగులు మొదలాయె

ఒ వైపు తరుగుతున్న ఆరోగ్యము
మరో వైపు పెరుగుతున్న ఆవేదన
ఎలా గట్టెక్కుతారో బిడ్డలు అని భయమాయె
ఎలా గడ్డనేయగలనో సంసారాన్ని అన్న
ఆలోచనల్లో ఉండగా వొచ్చె తీయటి కబురు
చిన్నోడు సాఫ్ట్ వేరు ఇంజనీరాయె, పెద్దోడు సర్కారు నౌకరాయె

లక్ష్మీదేవి కరుణించె, చిన్నోడు విదేశాలు వెళ్ళె
కొంచెం కొంచెం స్థితిగతులు మారె, సొంతఊరిలొ ఇల్లు పొలం అన్నీ వొచ్చె
కుమారులకు పెళ్ళిల్లు ఆయె, వంశోద్దారుకులు పుట్టె మనసు కుదిటపడె

చాలా సంక్రాంతుల తర్వాత చిన్నోడు ఈ సంక్రాంతికి ఇంటికొచ్చె
కనుమ నాడు పొలం గట్టున ఈ నా ముప్పాతిక సంవత్సరాల
జీవితగాదను చిన్నోడు ముందు నా మనసు నెమరేసె
ఆ రోజు రేయంతా ఏదో రాస్తూనె ఉన్న చిన్నోడిని చూసి కంగారు మొదలాయె
మరుసటి రోజు రైలు కదలబోయెముందు చెమ్మగిల్లిన కళ్ళతొ అందిచ్చె చిన్నోడు ఈ టపాను ...


L Ragas ....