Wednesday, August 19, 2009

నీ దాన్నై వొస్తాను ...


నన్ను కలవాలన్నావు
నాతో నడవాలన్నావు
నేను కలిసే క్షణం కోసం
వేయి కనులతో వేచి ఉన్నావు


నా నవ్వు నచ్చిందన్నావు
నీ మనసంతా నేనెనన్నావు
నన్నే ఆరాదించె
నీ గురించి ఆలోచించమన్నావు


కలిసి చదువుకున్న క్లాస్ మేట్ వి కాదు
పరిచయం ఉన్న పక్కింటి అబ్బాయివి కాదు
ఇంటర్నెట్ లొ చూసావు చాటింగ్ లొ కలిసావు
సాఫ్ట్ వేర్ స్నేహానివి టెలిఫోన్ నేస్తానివి


ఆకర్షించే అందగాడివి కాదు
సిరులున్న శ్రీమంతుడువి కాదు
విశాలమయిన వెక్తిత్వమూ లేదు
అయినా నీలొ ఏదొ తెలియని ప్రత్యెకత


ఇంతమంది స్నేహితులు వున్నా నీతొ చెప్పుకున్న ఊసులు ప్రత్యేకం
ఎంతో చక్కని కుటుంబంలొ వున్నా నీతొ గడిపిన క్షణాలు ప్రత్యేకం
పుట్టిన రోజున ఖరీదయిన బహుమతులు ఎన్నో వొచ్చినా
చిన్ని కవితతొ నువ్విచ్చిన దీవెనలు ఎంతో ప్రత్యేకం


తరగని నీ సహనము
చేరగని నీ చిరునవ్వు
నవ్వించే నీ మాటలు
కవ్వించే నీ కవితలు


నువ్వు నమ్ముకున్న సిద్దాంతాలు, నస పెట్టె నీ వేదాంతాలు :-)
నీకంటూ కట్టుకున్న నీ ఊహలోకం, నన్నల్లుకున్న నీ ప్రణయ ప్రపంచం
అన్నీ నిన్ను నా మదినిండా చిత్రుస్తున్నవి రా
అన్నీ నన్ను నీ దరికి చేరుస్తున్నవి రా


మా వాళ్ళను ఒప్పించలేమని తెలుసు
మీ వాళ్ళను మెప్పించలేమని తెలుసు
మనం కలిసి వుండేల ఈ వెవస్తను
మార్చలేమనీ తెలుసు, అయినా నీతొ వొస్తాను


వెబ్ క్యాం చూపులు తప్ప ఎప్పుడు ఎదురపడి చూడని నా కోసం
నాలుగేల్లుగా గుండేల మీద మల్లేల దారి పరుచుకున్న నీ కోసం వొస్తాను
తల్లిదండ్రుల ఆప్యాయత తప్ప ప్రేమంటే తెలియని నాలో
నీ వలపుల తలపులతొ మది నిండా ప్రేమ నింప్పిన నీకై నీ దాన్నై వొస్తానుస్తాను ...



L Ragas ...


Saturday, August 1, 2009

దీవించండి



ఉత్తరాన ఉదయించిన గంగమ్మ తల్లి
దక్షిణాన వెలసిన వెంకన్న స్వామి
తూర్పున కొలువయిన కనక దుర్గమ్మ తల్లి
పడమర ప్రకాశించిన షిరిడి సాయి నాదా
నాలుగు దిక్కులు, పంచ భూతాలు సాక్షిగా
నిండుగ నూరేళ్ళు జీవించమని నా చెలిని దీవించండి ...

సూర్య చంద్రులారా
ముల్లోకాల దేవతలారా
చతుర్వేదాల సాక్షిగా
నా పంచ ప్రాణాల ప్రేయసిని దీవించండి ...

సప్త ఋషులారా
అష్ట దిక్పాలకులారా
నవగ్రహాల సాక్షిగా
పది కాలాలు చల్లగా ఉండమని నా దేవతను దీవించండి ...

పాఠకులారా, పండితులారా
స్నేహితులారా, శ్రెయొభిలాషులారా
మంచి గందమంటి మీ మనసే సాక్షిగా
నా కోసం పుట్టిన నా ప్రియసఖిని పుట్టిన రోజు శుభాకాంక్షలతో దీవించండి ...

L Ragas ...

Sunday, July 5, 2009

తెలియదు !!



తెలియదు !!


సర్కారీ బడిలో సాంబార్ అన్నం కోసం పళ్ళెం పట్టుకొని పంక్తిలో నిలుచిన్న రోజుల నుంచి
హాలివుడ్ స్టుడియోలో హాలిడే స్పెషల్ లంచ్ తినే రోజులు వొచ్చిన తీరు తెలుసు


టెంట్ హాల్లో నేల టిక్కెట్, చేక్కిలం ముక్కతో మట్టిలో కూర్చోని సినిమా చూసిన రోజుల నుంచి
PVR సినిమాలో ప్రీమియం టిక్కెట్, పెప్సి పాప్ కార్నులు తీసుకునే రోజులు వొచ్చిన తీరు తెలుసు


పైసలు లేక పదో తరగతి వరకు ప్యాంటు కొనలేని రోజుల నుంచి
బ్రాండెడ్ బట్టలు కొంటూ దర్జీ దగ్గరికి పోనవసరం లేని రోజులు వొచ్చిన తీరు తెలుసు


చెప్పిన పాఠాలె మల్లి మల్లి చెప్పే టుషన్స్ నడిపి నెలకు ఐదు వందలు సంపాదించిన రోజుల నుంచి
కార్పొరేట్ లోకంలో కంపెనీ తర్వాత కంపెనీ మారి రోజుకు ఐదు వేలు సంపాదించే రోజులు వొచ్చిన తీరు తెలుసు



కాని చిన్ని చిన్నికోరికల చిన్న తనం నుంచి
మనీ తప్ప మరేది మదిలో లేని మద్య వయసు వొచ్చిన తీరు తెలియదు


ముందు కష్టపడు తర్వాత సుఖాలు అవే వొస్తాయి అనే నాన్న సూక్తులు పాటించి పాటించి
అనుభవించే ప్రాయం పోయి ఆవేదన మాత్రం మిగిలిన ప్రాయం వొచ్చిన తీరు తెలియదు


కోరికలు ఇష్టాలు అందరికి ఇచ్చిన ఆ దేవుడు
అవి తీర్చుకునే అవకాశం అవసరమయిన డబ్బులు కొందరికే ఎందుకు ఇచ్చాడో తెలియదు


L Ragas !!

Monday, May 25, 2009

నీకోసం


నా స్వరం విని విని విసిగి బెజారిన నీ చెవులకు
మాటలు పోయి మూగబోయాడన్న శుభవార్త వినిపించనా ??

నా నుంచి దూరమవ్వాలని పరుగులు తీసి తీసి అలసిన నీ ఖంఠమునకు
నాలోని ప్రతి రక్తం చుక్క కన్నీరుగా మలచి దాహం తీర్చనా ??

నా ప్రేమ చీకటినే మిగిలించిందని చింతుస్తున్నా నీ కనులకు
నా పంచ ప్రాణాలు పనంగా పెట్టి ఆ చితి మంటలతో వెలుగునివ్వనా ??

నేనున్న లోకంలొ ఎలా తిరగనూ అని నాలుగుగోడల మధ్య నలుగుతున్న నీకు
నేను లేని ఈ లోకాన్ని నీకోసం బహుమతిగా ఇవ్వనా ప్రియతమా...!!
L Ragas ...

Wednesday, April 15, 2009

తరగని నా ప్రేమ కరగని నీ మనసు


తరగని నా ప్రేమ కరగని నీ మనసు

వాడిపోయె కొద్ది ఆకులు రాలిపోతాయి
రాలిపోయె కొద్ది పువ్వులు బొసిపోతాయి

నడిచే కొద్ది ఎండమావి ఇంకిపొతుంది
తడిచే కొద్ది మట్టిరాయి కరిగిపొతుంది

కాని ఎన్ని యుగాలు మారిన సూర్యుడి వెలుగు మారదు
ఎన్ని పున్నమిలు దాటిన చంద్రుడి వెన్నల వన్నె తగ్గదు

ఎన్నేళ్ళు గడచినా నా ప్రేమ తరగదు
ఎన్నాళ్ళు ఎదురుచూసినా నీ మనసు కరగదు.


L Ragas ...




Saturday, January 3, 2009