Sunday, May 20, 2012

నా కవిత ...


చాన్నళ్ళుగా నడుపుతున్న కారే
ఎన్నేళ్ళుగా ఎదురుచూస్తున్న 'షి'కారే
ఈ రోజు  నా కూడ నువ్వొస్తుంటె 
ఉరకలేస్తుందే నా కారు, నిండు గోదావరి వలె ...

కొన్నేళ్ళుగా నడుస్తున్న దారే
ఏనాడు నా వంక చూడని జెనాలే
ఈనాడు నీ హంస నడకతొ కలిసి నేనడుగులేస్తుంటె
గుచ్చి గుచ్చీ చూస్తున్నారే, గుడ్ల గూబల వలె ...

వందల్లొ మురిపించె గాయిని గాయకులున్నా 
వేలల్లొ మైమరిపించె మెలోడి గీతాలు ఉన్నా 
సంధ్యా సమయాన సన్నని నీ కూని రాగాలు వింటుంటె
అలసటంతా ఆవిరై ఉత్సాహము ఉదయించే నాలో, తూరుపు సిందూరం వలె ...

అంతు పట్టని అలజడి ఆలోచనలున్నా 
అస్త వ్యస్తంగా అర్తం కాని అంతరంగమున్నా 
ఈ క్షణం నీ ముసి ముసి నవ్వును చూస్తుంటె  
మురిసిపోతుందే నా మనసు, ముద్ద మందారం వలె ...

ఎన్నో భావాలున్నా చెప్పలేని మౌన జీవతంలొ
మరెన్నో ఊహల ఊసులున్నా పంచుకోలేని ఒంటరి ప్రయాణంలొ
తారసపడ్డ నీ ముద్దు ముద్దు పలుకులతో  జత కలుపుతుంటె
మనసులోని మాటలు పాటలై ఉప్పోంగుతున్నాయే, ఈ నా కవిత వలె ...
                                                                              

 L Ragas

No comments: